ఆస్పత్రిలో పలు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

by Sridhar Babu |
ఆస్పత్రిలో పలు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం
X

దిశ, కామారెడ్డి : జిల్లా ప్రధాన ఆసుపత్రిలోని యాంటీ రెట్రోవైరల్ థెరఫీ (ఏ.టి.ఆర్.సెంటర్) కేంద్రంలో కాంట్రాక్టు ప్రాతిపదికన స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్టు పోస్టులకు ఆసక్తి, అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ బన్సీలాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు క్యాటగిరీలలో ఒక్కో పోస్టు కలదని ప్రతి పోస్టులో మైక్రో సాఫ్ట్ ఆఫీసు (ఎం.ఎస్. ఆఫీస్), ఇంటర్నెట్, ఎలక్ట్రానిక్ మెయిల్ కంప్యూటర్ లో పరిజ్ఞానం కలిగి ఉండాలని, ఎంపికైన వారు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోని ఏటీఆర్ సెంటర్ లో పూర్తిగా కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు.

నెలకు రూ.21,000 వేతనంఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. స్టాఫ్ నర్స్ పోస్టుకు అభ్యర్థులు బిఎస్సీ స్టాఫ్ నర్సు పూర్త చేసి రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలని కోరారు. ల్యాబ్ టెక్నిసియన్ కు గుర్తింపు పొందిన మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ (ఎంఎల్టీ) లో గ్రాడ్యుయేషన్/డిప్లొమా పూర్తి చేసి రాష్ట్ర కౌన్సిల్ లో నమోదయి ఉండాలని, అదేవిధంగా ఫార్మాసిస్టు కు గుర్తింపు పొందిన ఫార్మాసిస్టు సంస్థ నుండి ఫార్మసీలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలని, లేదా ఆరోగ్య సంరక్షణ సంస్థలో మూడు సంవత్సరాల అనుభవం కలిగి రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలని స్పష్టం చేశారు. అర్హత కలిగి ఆసక్తి గల అభ్యర్థులు పక్షం రోజులలో అవసరమైన ధ్రువపత్రాలతో కామారెడ్డి లోని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కు చేరునట్లు దరఖాస్తు పంపాలని, వివరాలకు తమ కార్యాలయంలో సంప్రదించాలని బన్సీలాల్ సూచించారు.

Advertisement

Next Story

Most Viewed