- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
politics : రాజకీయాల్లోకి మరో పోలీస్...
దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రానికి చెందిన మదనం గంగాధర్ తన డీఎస్పీ ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించి.. నిజామాబాద్-అదిలాబాద్- మెదక్- కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగానున్నారు. చాలామంది పోలీస్ అధికారులు వారి ఉద్యోగాలను వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. కానీ పర్మినెంట్ గా రాజకీయాల్లో నిలువలేకపోయారు. కానీ ఐపీఎస్ లు ప్రవీణ్ కుమార్, జేడీ లక్ష్మీనారాయణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలను వదిలి రాజకీయాల్లో ప్రవేశించడంతో.. వారి రాజకీయ ప్రవేశం తెలుగు రాష్ట్రాల్లో హార్ట్ టాపిక్ మారింది. ఇరువురు ఉద్యోగులు ఉద్యోగాల్లో మంచి పేరు సంపాదించిన రాజకీయాల్లో మాత్రం వారు అనుకున్నంతగా రాణించలేకపోయారు.అలాగే పోలీసులు ,ఇతర ఉద్యోగులు సైతం రాజకీయాల్లో రాణించిన వారు ఎందరో ఉన్నారు. డిజిపి పూర్ణచందర్రావు బీఎస్పీ పార్టీలో కొనసాగుతున్నారు. అదేవిధంగా ఇంతకుముందు నిజామాబాద్ జిల్లా సీపీగా పని చేసిన నాగరాజు తొలుత బిఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యే గా పోటీ చేయాలని ఆశించిన..చివరకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ సాధించి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. రాజకీయాల్లోకి వచ్చే పోలీసులకు కొందరికి అనుకూలంగా.. మరికొందరికి ప్రతికూలంగా ఫలితాలు వచ్చాయి.మరి డిఎస్పి పదవికి వాలంటరీ రిటైర్మెంట్ చేసి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగనున్న మదనం గంగాధర్ భవిష్యత్ ఎలా ఉండఈనుందో మరి..ముందు రోజుల్లో తేలనుంది.
కడు పేదరికంలో జన్మించిన మధనం గంగాధర్ మధ్యాహ్నం అడుక్కుంటూ రాత్రి వేళల్లో చదువుకుంటూ జీవనం సాగించి.. ఉన్నత స్థానాలకు చేరుకున్నాడు. పట్టువదలని విక్రమార్కుడిలా అడుక్కునే ఫ్యామిలీలో జన్మించిన మధనం గంగాధర్ రాత్రి బడిలో చదువుకుంటూ కసితో 22 ఏళ్ల వయస్సులోనే ఎస్సైగా ఉద్యోగాన్ని సంపాదించాడు. 26ఏళ్ల పాటు ఎస్ హెచ్ ఓ గా పనిచేసే చివరకు డిఎస్పీగా పదోన్నతి పొంది..సమాజ మార్పు కోసమే డిఎస్పీ ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ చేస్తున్నట్లు అధికారికంగా మదనం గంగాధర్ ప్రకటించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఏది ఏమైనా డిఎస్పీ ఉద్యోగాన్ని వదిలి సమాజ మార్పు కోసం ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించి.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న మదన గంగాధర్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది త్వరలోనే తేలనుంది.