- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భక్తిశ్రద్ధలతో సాయిబాబా సత్సంగ కేంద్రం వార్షికోత్సవం
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఆర్టీసీ కాలనీలోని శ్రీ షిర్డీ సాయినాథుని 18వ వార్షికోత్సవ ఆధ్యాత్మిక వేడుకలు ఆదివారం భక్తి ప్రపత్తులతో ఘనంగా జరిగాయి. శ్రీ సాయినాథ సత్సంగ కేంద్రంలో నిర్వహించిన ఈ భక్తి కార్యక్రమంలో ఆధ్యాత్మిక బోధనలు, భజన కార్యక్రమాలు, బాబా ప్రవచనాలు, పూజా కార్యక్రమాలు, భక్తి పూర్వక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బంతి, గులాబీ వంటి తీరైన పుష్పాలతో అల్లిన దండలతో అందంగా అలంకరించిన వావానంపై సాయిబాబా ఉత్సవ మూర్తితో పాటు, శరత్ బాబూజీ నిలువెత్తు చిత్రపటాన్ని కొలువుదీర్చి భజనలు, కీర్తనలు ఆలపిస్తూ ఊరేగింపు నిర్వహించారు.
ఆర్టీసీ కాలనీలోని సత్సంగ కేంద్రం నుండి అంబేద్కర్ సర్కిల్ మీదుగా బస్టాండ్ వరకు ఊరేగింపు కొనసాగింది. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా జరిగిన ఈ కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు, వృద్ధులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. స్వామి వారి వేదికను, ఊరేగింపు రథాన్ని అలంకరించేందుకు మహిళలు సామూహికంగా ఉత్సాహం చూపారు. 18 ఏళ్ల క్రితం ఇక్కడ సాయిబాబా సత్సంగ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని సాయి భక్తులు అర్చన, శివ తెలిపారు.