Additional Collector : ప్రజా పాలన దరఖాస్తుల సవరణను పకడ్బందీగా నిర్వహించాలి

by Kalyani |
Additional Collector : ప్రజా పాలన దరఖాస్తుల సవరణను పకడ్బందీగా నిర్వహించాలి
X

దిశ ఆర్మూర్ : ప్రజా పాలన దరఖాస్తుల సవరణను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా లోకల్ బాడీ అదనపు కలెక్టర్ అంకిత అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ప్రజా పాలన కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ మంగళవారం సందర్శించారు. దరఖాస్తుల సవరణ రిజిస్టర్ నీ పరిశీలించి, ప్రతి అప్లికేషన్ సమస్యని వివరంగా రిజిస్టర్ లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. ఎడిట్ ఆప్షన్ అన్నింటికీ ఇస్తే బాగుంటుందని ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రెండూ కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకి సౌకర్యంగా చేసినందుకు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story