తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు

by Sridhar Babu |
తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు
X

దిశ, బోధన్ : వచ్చే వేసవి కాలంలో పల్లెల్లో తాగునీటి సమస్యలు రాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. రెంజల్ మండలంలోని బాగేపల్లి, కునేపల్లి, కల్యాపూర్ లో ఎమ్మెల్యే పర్యటించారు. ముందుగా బాగేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం కునేపల్లి లోని ప్రభుత్వ పాఠశాలను పరిశీలించి ఉపాధ్యాయులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం కల్యాపూర్ లో పర్యటించారు.

ఈ సందర్భంగా విపక్ష పార్టీలకు చెందిన నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. వారిని పార్టీ కండువా వేసి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చిన 6 గ్యారంటీ లలో మరో రెండు 500 కే గ్యాస్ సిలండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను మరో వారం రోజులలో అమలు పరుస్తామని తెలిపారు. వేసవి లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెంజల్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story