- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ల్యాండ్ సర్వే ఏడీ ఇంటిలో ఏసీబీ సోదాలు..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ లో లంచం తీసుకుంటు దొరికిన ల్యాండ్ సర్వే సహయ సంచాలకులు శ్యాంపుంధర్ రెడ్డి ఇంటిలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఆదివారం హైద్రాబాద్ లోని ఏడీ శ్యాంసుందర్ ఇంటిలో ఏసీబీ అధికారులు తనిఖీలలో గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. సూమారు రూ.78 లక్షల నగధు, 15 తులాల బంగారు నగలు గుర్తించారు. పోస్టల్ డిపాజిట్లు లక్షల్లో ఉన్నట్టు గుర్తించారు. విలువైన స్థిర చరాస్థులకు సంబంధించిన దస్తావేజులను గుర్తించారు.
దస్తావేజులలో ఉన్న అస్థుల విలువ రూ.10 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. సంగారెడ్డి జిల్లాకు చెందిన శ్యాం సుంధర్ రెడ్డి మహభూబ్ నగర్ లో విధినిర్వహణ సమయంలో అక్కడి జిల్లా కలెక్టర్ సరెండర్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో పనిచేసి కిషన్ రావు 8 సంవత్సరాలు సుదీర్ఘకాలం పనిచేయగా తప్పని సరిబదిలీలో ఇక్కడికి శ్యాంసుంధర్ రెడ్డికి పోస్టింగ్ ఇచ్చారు. వచ్చిన 8 నెలల కాలంలోనే ల్యాండ్ సర్వే కార్యాలయంను అడ్డాగా చేసుకుని దళారుల ద్వార సర్వేల పేరిట డబ్బులు బాగా గుంజాడని ఫిర్యాదులు ఉన్నాయి. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఏడీ అవినితి పై మందలించిన పనీతీరు మార్చుకోకుండా ఎకంగా ఏసీబీకీ చిక్కి కటకటాలపాలయ్యారు.