ఇంట్లో నుంచి వెళ్లిన యువకుడు అదృశ్యం

by Sridhar Babu |
ఇంట్లో నుంచి వెళ్లిన యువకుడు అదృశ్యం
X

దిశ, కామారెడ్డి : ఇంట్లో నుంచి వెళ్లిన యువకుడు అదృశ్యమైన సంఘటన కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని గోసంగి కాలనీలో చోటు చేసుకున్నట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. గోసంగి కాలనీకి చెందిన చింతల సురేష్ (27) అనే వ్యక్తి గత నెల 31న సాయంత్రం 4 గంటలకు ఇంట్లో నుండి వెళ్లిపోయి తిరిగి ఇంటికి రాలేదన్నారు. అతని గురించి భార్య వెంకటలక్ష్మి చుట్టుపక్కల, తెలిసిన వారి వద్ద విచారించగా ఆచూకీ లభించలేదన్నారు. అంతేగాకుండా అతను ఫోను ఇంటి వద్దనే పెట్టి బయటకు వెళ్లిపోయాడని తెలిపారు. భార్య వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

Advertisement
Next Story