car Accident : అదుపుతప్పి కారు బోల్తా.. యువకుడికి గాయాలు..

by Sumithra |
car Accident : అదుపుతప్పి కారు బోల్తా.. యువకుడికి గాయాలు..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జక్రాన్ పల్లి మండలం చింతలూరు సమీపంలో మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు అదుపుతప్పి పసుపు తోటలో బోల్తా పడింది. కారు నడుపుతున్న యువకుడి తలకు స్వల్ప గాయాలయ్యాయి. మనోహరాబాద్ గ్రామానికి చెందిన రాహుల్ అనే యువకుడు తన వ్యక్తిగత పనుల పై వేల్పూర్ మండలం అక్లూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారులో ఒక్కరే ఉండడం వల్ల ప్రమాదం జరగలేదు. వేగంగా వెళుతున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనున్న పసుపు పంటలో పడిపోయింది. వ్యవసాయ క్షేత్రాల్లో ఉన్న రైతులు పరుగున వచ్చి క్షతగాత్రుడిని సాయం అందించారు.

Advertisement

Next Story