బరంగ్ ఏడ్గిలో యువకునిపై చిరుత పులి దాడి

by Sridhar Babu |
బరంగ్ ఏడ్గిలో యువకునిపై చిరుత పులి దాడి
X

దిశ, బాన్సువాడ : బీర్కూర్ మండలం బరంగ్ ఏడ్గి గ్రామానికి చెందిన వడ్ల విజయ్ అనే యువకునిపై శుక్రవారం మధ్యాహ్నం చిరుతపులి దాడి చేసి గాయపర్చడం కలకలం రేపింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వడ్ల విజయ్ ప్రతి రోజు మాదిరిగా మంజీరా నది గట్టున గల పొలంలో పని చేసేందుకు వెళ్లి పొలం గెట్టు వద్ద వంగి పని చేస్తుండగా ఆకస్మాత్తుగా చిరుతపులి వచ్చి దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన గ్రామస్తులు యువకున్ని 108 అంబులెన్సులో బాన్సువాడ ప్రభుత్వ అస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

Next Story

Most Viewed