ఆకాశంలో అద్భుతం.. మూడు రంగుల్లో సూర్యుడు

by Mahesh |   ( Updated:2022-08-10 09:56:22.0  )
ఆకాశంలో అద్భుతం.. మూడు రంగుల్లో సూర్యుడు
X

దిశ, కామారెడ్డి రూరల్: కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయం సమీపంలో ఆకాశంలో అద్భుతం చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 75 వ భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో ఆకాశంలోని సూర్యుడు వృత్తములో దర్శనమిచ్చాడు. వృత్తాకారంలో అక్కడక్కడ త్రివర్ణ శోభితం కనిపించింది. సూర్యుని చుట్టూ ఏర్పడిన వలయం పై భాగంలో ఆకుపచ్చ, మధ్యలో తెలుపు కషాయం దర్శనమివ్వగా కింద భాగంలో పైన కషాయం, మధ్యలో తెలుపు, కింద ఆకుపచ్చ రంగులు కనిపించాయి. అలాగే మధ్యలో ఉన్న సూర్యునిపై కాషాయం, తెలుపు, ఆకుపచ్చ వర్ణాలు కనిపించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. సుమారు అరగంట పాటు వృత్తాకారంలో దాదాపు త్రివర్ణ పతాకం రంగులతో దర్శనమివ్వడం తో పలువురు సూర్యుని వలయాన్ని ఆసక్తిగా గమనించారు.

మంథనిలో టీఆర్ఎస్ నేతల దౌర్జన్యం.. కేసు నమోదు (వీడియో)

Advertisement

Next Story