ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

by Sridhar Babu |
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
X

దిశ , నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ నగర శివారులోని మల్కాపూర్ తండా శివారులో గల అడవిలో ఈ నెల 5న వెలుగు చూసిన హత్య కేసులో ఇద్ధరు నిందితులను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు. ఆదివారం ఏసీపీ విలేఖరులతో మాట్లాడుతూ ఈ నెల 5న ఒక గుర్తు తెలియని (30 నుండి 35 మధ్య సంవత్సరాల ) వ్యక్తిని ఎవరో గొంతు వద్ద చాకు తో కోసి చంపినట్లు గా గుర్తించినట్లు తెలిపారు. ఈ మర్డర్ పై నిజామాబాద్​ రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తదుపరి విచారణలో నిజామాబాద్ రూరల్ ఎస్ఐ మహేష్, నిజామాబాద్​ రూరల్ సౌత్ ఎస్​ఐ వెంకట నారాయణ డాగ్స్క్ స్క్వాడ్, క్లూస్​ టీంలను పిలిపించి వారి సహాయంతో దర్యాప్తును వేగవంతంచేశారు.

హత్యకు గల కారణాలను అన్ని కోణాలలో దర్యాప్తు చేసినట్లు తెలిపారు. మృతుని కుడి చేతికి గల పచ్చ బొట్టు ద్వారా మృతుడు గురుధాకర్ సయాజీ ( 35 )గా, నిజామాబాద్ నగరంలోని ఇంద్రపురం నగర్ నివాసిగా గుర్తించినట్లు తెలిపారు. అలాగే రామ్ సయాజీ, మృతుని భార్య అశ్విని ఇద్దరూ సొంత బావ మరదలు. వీరిద్దరి మధ్య కొద్ది నెలలుగా వివాహేతర సంబంధం ఉంది. మృతుడైన గురుధాకర్ సయ్యాజీ మద్యానికి బానిసై అశ్వినిని శారీరకంగా వేధించేవాడు. అతని వేధింపులు ఎక్కువకావడంతో అశ్విని తన బావ రామ్ సయాజీతో కలిసి మృతున్ని చంపుదామని పథకం వేసింది. మల్లారం రిజర్వు ఫారెస్ట్ ఏరియాలో చంపాలని భావించి పథకం వేశారు. ఈ క్రమంలో ఈ నెల 3న గురుధాకర్ సయ్యాజీ తన భార్య ఆశ్వినిని కొట్టి బయటకు వచ్చాడు. తర్వాత అశ్విని రామ్ సయాజీకి ఫోన్ చేసి తన భర్తను హతమార్చమని కోరింది.

దాంతో గురుధాకర్ ను కలిసిన రామ్​ సయాజీ ఇద్దరూ కలిసి మద్యం తాగారు. మల్లార రిజర్వు ఫారెస్ట్ ఏరియాకు తీసుకు వెళ్లి గొంతు కోసి చంపాడు. అక్కడ నుంచి తాను ఇంటికి వెళ్లిపోగా పోలీస్ లను అశ్విని తప్పుదోవ పట్టించాలని చూసింది. కానీ నిందితులు రామ్ సయాజీ, అశ్వినిని ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఈ విలేఖరుల సమావేశంలో నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐ వెంకట నారాయణ , నిజామాబాద్​ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ జి. మహేష్ సిబ్బంది పాల్గొన్నారు. వ్యక్తి మర్డర్ కేసులు 48 గంటలలో ఛేదించిన పోలీస్ అధికారులను సీపీ కళ్మేశ్వర్ అభినందించారని ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు.

Advertisement

Next Story