ఆదర్శ గ్రామాన్ని పరిశీలించిన ట్రైనీ కలెక్టర్

by Sridhar Babu |
ఆదర్శ గ్రామాన్ని పరిశీలించిన ట్రైనీ కలెక్టర్
X

దిశ, ఆర్మూర్ : మండలంలోని ఆదర్శ గ్రామమైన అంకాపూర్ లో ట్రైనీ కలెక్టర్ కిరణ్మయి వివిధ అంశాలపై గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ముందుగా గ్రామ పంచాయతీ ఆవరణలో ఐకేపీ, ఉపాధి హామీ కూలీలతో వారి స్కీములపై ట్రైనీ కలెక్టర్ ముఖాముఖిగా చర్చించారు. గ్రామంలోని బృహత్ పల్లె ప్రకృతి వనం, నర్సరీలను ట్రైనీ కలెక్టర్ సందర్శించారు. అంతే గాక సీడ్ ప్రాసెసింగ్ ఏ విధంగా జరుగుతుందో అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీఓ శివకృష్ణ, ఎంపీడీవో సాయిరాం, జక్రంపల్లి ఎంపీఓ ఖాన్, రైతు సంఘం మాజీ కార్యదర్శి కేకే. బాజన్న, ఏపీవో సురేష్, ఐకేపీ ఏపీఎం గంగారం, పంచాయతీ కార్యదర్శి హారిక, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed