ఏపీ యువతకు సర్‌ఫ్రైజ్.. బిగ్ అనౌన్స్మెంట్ చేసిన మంత్రి నారా లోకేష్

by Mahesh |   ( Updated:2024-10-09 14:42:34.0  )
ఏపీ యువతకు సర్‌ఫ్రైజ్.. బిగ్ అనౌన్స్మెంట్ చేసిన మంత్రి నారా లోకేష్
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువతి, యువకులకు మంత్రి నారా లోకేష్ శుభవార్తను అందించారు. గత రెండు రోజులుగా బిగ్ అనౌన్స్మెంట్ ఇస్తానని చెప్పుకొచ్చిన ఆయన.. ఈ రోజు(బుధవారం 09-10-2024)న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ వైజాగ్‌లో ఎర్పాటు చేయబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. దీని ద్వారా 10 వేల మందికి ఉద్యోగాలు దక్కుతాయిన ఆయన పేర్కొన్నారు. తన ట్వీట్‌లో " వైజాగ్‌లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ 10,000 మంది ఉద్యోగులతో కూడిన ఐటీ సదుపాయాన్ని అభివృద్ధి చేయడాన్ని నేను సంతోషిస్తున్నాను. 'వ్యాపారం చేయడంలో వేగం' అనే మా నినాదంతో నడిచే కార్పొరేట్‌లకు అత్యుత్తమ పెట్టుబడి వాతావరణాన్ని అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. ఆంధ్రప్రదేశ్‌ను వ్యాపారం చేయడానికి భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా చేయడానికి మేము కృషి చేస్తున్నందున TCS ద్వారా ఈ పెట్టుబడి ఒక ముఖ్యమైన మైలురాయి." అని రాసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed