ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిలిమ్స్ పోటీలకు ఆహ్వానం

by Sridhar Babu |
ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిలిమ్స్ పోటీలకు ఆహ్వానం
X

దిశ, జగిత్యాల టౌన్ : జిల్లా కేంద్రంలోని యువకులు, ఫొటోగ్రాఫర్లు షార్ట్ ఫిలిమ్స్ పోటీల్లో పాల్గొనాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కోరారు. శాంతి భద్రతల దృష్ట్యా తమ ప్రాణాలను వదిలి వీరమరణం పొందిన అమర పోలీసుల జ్ఞాపకార్ధం అక్టోబర్ 21న జరుగు పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పోలీస్ రిలేటెడ్ అంశం మీద ఫొటోస్, షార్ట్ ఫిలిమ్స్​ తీయడానికి జిల్లాలో ఆసక్తి గల యువకులు ముందుకు రావాలని కోరారు.

పోలీసు త్యాగాలు గుర్తుచేసే వీడియోస్ కానీ, విధుల్లో ప్రతిభ కనబరిచిన ఫొటోలు కానీ పంపాలని అన్నారు. మూడు ఫొటోలు కానీ, మూడు నిమిషాల వీడియోకానీ పెన్ డ్రైవ్ లో వివరాలతో పాటు ఈనెల 20వ తేదీలోపు దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్లో అందజేయాలని కోరారు. జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయిన మూడు షార్ట్ ఫిలిమ్స్ ను స్టేట్ కాంపిటేషన్ కు డీజీపీ ఆఫీసు హైదరాబాద్ కు పంపనున్నట్టు చెప్పారు.

Advertisement

Next Story