RBI: వరుసగా పదోసారి రెపో రేటులో మార్పు లేదు

by S Gopi |
RBI: వరుసగా పదోసారి రెపో రేటులో మార్పు లేదు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఊహించినట్టుగానే భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కీలక రేట్లను మరోసారి ఏ మార్పు లేకుండా కొనసాగించింది. ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధిని పరిగణలోకి తీసుకుని వరుసగా పదోసారి రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగిస్తూ ఎంపీసీ నిర్ణయం తీసుకుంది. బుధవారం ముగిసిన ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) సమావేశానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ భిప్రాయపడింది. వచ్చే 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 7.3 శాతంగా అంచనా వేసింది. ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో ఇప్పటివరకు ఉన్న లక్ష్యం పరిధి నుంచి భారీగా పెరిగినప్పటికీ ఆ తర్వాత తగ్గుముఖం పట్టవచ్చని వివరించింది. బ్యాంకుల కార్యకలాపాలు పటిష్టంగా ఉండటంతో ఆర్థిక రంగం స్థిరంగా ఉందని మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 4.8 శాతానికి పెరుగుతుందని చెప్పారు. ద్రవ్యోల్బణ నియంత్రణ నెమ్మదిస్తుందని, ఆర్‌బీఐ లక్ష్య పరిధిని అధిగమించే అవకాశం ఉందని దాస్ పేర్కొన్నారు. ఈ సమయంలో కీలక రేట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని భావించాం. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంతో పాటు ఆర్థిక వృద్ధిని కొనసాగించేందుకు జాగ్రత్త వైఖరిని అనుసరిస్తున్నామని దాస్ వెల్లడించారు. అలాగే, పాలసీ వైఖరిని తటస్థంగా మారుస్తూ నిర్ణయించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీడీపీ వృద్ధి అంచనాను 7.2 శాతంగా ఎంపీసీ అంచనా వేసింది. రెండో త్రైమాసికంలో 7 శాతంగానూ, ఆఖరి రెండు త్రైమాసికాల్లో 7.4 శాతంగా అభిప్రాయపడింది. వచ్చే 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 7.3 శాతంగా అంచనా వేసింది. వర్షపాతం మెరుగ్గా ఉండటం, స్థిరమైన తయారీ, బలమైన సేవల రంగం కారణంగా వృద్ధి సానుకూలంగా ఉందని గవర్నర్ దాస్ ప్రస్తావించారు.

యూపీఐ లైట్ పరిమితి పెంపు..

ఇదే సమావేశంలో యూపీఐ లావాదేవీలకు సంబంధించి పరిమితిని పెంచుతూ కమిటీ నిర్ణయం తీసుకుంది. డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేస్తూ యూపీఐ లైట్ ప్రతి లావాదేవీ పరిమితిని ఇప్పుడున్న రూ. 500 నుంచి రూ. వెయ్యికి పెంచింది. యూపీఐ లైట్ వ్యాలెట్‌కు రూ. 2,000 నుంచి రూ. 5,000కి పరిమితిని పెంచారు. 'యూపీఐ 123పే' లిమిట్‌ను కూడా రెట్టింపు చేస్తూ రూ. 10 వేలకు పెంచారు. అదే విధంగా ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ చెల్లింపుల్లో పొరపాట్లను తగ్గించేందుకు ఈ సాధనాల్లో నగదు బదిలీ చేసే సమయంలో అవతలి వ్యక్తి పేరు కనిఒంచే సదుపాయాన్ని ఆర్‌బీఐ ప్రతిపాదించింది.

Advertisement

Next Story