Muthineni Veeraiah: వికలాంగుల శాఖలో భారీగా అవినీతి.. బీఆర్ఎస్ కు చిప్పకూడే

by Y.Nagarani |
Muthineni Veeraiah: వికలాంగుల శాఖలో భారీగా అవినీతి.. బీఆర్ఎస్ కు చిప్పకూడే
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో వికలాంగుల శాఖలో అవినీతి జరిగిందని కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య (Muthineni Veeraiah) ఆరోపించారు. బుధవారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో మంత్రి, కార్పొరేషన్ చైర్మన్, ఓ అధికారిణి కుమ్మక్కై దాదాపు రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను వేర్వేరు ఖాతాల్లోకి మళ్లించి అక్రమాలకు తెర లేపారని వివరించారు. ఒక ఆర్ధిక సంవత్సరానికి, మరో ఆర్ధిక సంవత్సరానికి అకౌంట్ల ట్యాలీ అవడం లేదన్నారు. నిధులు దుర్వినియోగం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. కొన్ని సార్లు మేనేజ్ మెంట్ కమిటీ పర్మిషన్ లేకుండా కూడా హెచ్ ఆఫీస్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేశారన్నారు. వికలాంగుల పరికరాల నిమిత్తం వచ్చిన నిధులను కూడా దోచుకున్నారని మండిపడ్డారు. ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఉంటాయా? అని ప్రశ్నించారు.

బిల్డింగ్ రెనోవేషన్ పేరిట కూడా నిధులు వాడారన్నారు. వికలాంగుల బడ్జెట్ నుంచి జీతాలకూ డబ్బులు వాడారని, అప్పుడు జీతాలకు వచ్చిన నిధులు ఏమైనట్లు? అని ప్రశ్నించారు. లెక్కలు తీస్తుంటే, అన్ని లొసుగులే ఉన్నాయని విమర్శించారు. పదేళ్లలో ఈ తరహాలో దోపిడి జరిగిందంటే ఆశ్చర్యంగా ఉన్నదన్నారు. కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేస్తూ ఫించన్ తీసుకున్న చరిత్ర బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వంలో జరిగిందన్నారు. సీసీ కెమెరాల పేరిట లక్షల రూపాయిలు దోచుకున్నారన్నారు. త్వరలో వికలాంగుల శాఖ డైరెక్టర్ గా ఓ ఐఏఎస్ ను నియమిస్తామని వెల్లడించారు. దమ్ము ఉన్న బీఆర్ ఎస్ నాయకుడెవరైనా, వికలాంగులు, సంక్షేమశాఖలో జరిగిన అవినీతిపై చర్చకు రావాలని ముత్తినేని సవాల్ (Muthineni Challenge to BRS) విసిరారు. వికలాంగుల శాఖలో త్వరలోనే ఏసీబీ, విజిలెన్స్ ఎంక్వైయిరీ వేస్తున్నామని ప్రకటించారు. తప్పు చేసిన అధికారి, గత ప్రభుత్వ పెద్దలను ఎవరినీ విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed