- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంద కృష్ణ మాదిగ వెనుక బీజేపీ ఎజెండా: కాంగ్రెస్ నేతలు
దిశ, తెలంగాణ బ్యూరో: మంద కృష్ణ వెనుక బీజేపీ ఏజెండా ఉన్నదని కాంగ్రెస్ నేతలు సతీష్ మాదిగ, పిడమర్తి రవిలు ఆరోపించారు. బహుజనుల కాంక్షను చంపిన వ్యక్తి మంద కృష్ణ మాదిగ అని ఫైర్ అయ్యారు. బుధవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..ఎస్సీ వర్గీకరణ బీజేపీ చేస్తుంటే, ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ప్రాసెస్ జరగడం లేదని ప్రశ్నించారు. మంద కృష్ణ బీజేపీ చెప్పినట్లు చేస్తున్నాడని మండిపడ్డారు. సుప్రీం కోర్టు తీర్పు రాగానే వర్గీకరణ అయిపోయిందని సంబురాలు చేసి, ఇప్పుడు మౌనంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో మాదిగలు 12 శాతం ఉంటే, 7 శాతం కోసం విచిత్రంగా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రలో ఉన్న మాదిగలకు న్యాయం జరగాలని మంద కృష్ణ ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ, టీడీపీ కూటమిని బలోపేతం చేయాలని ఆయన బ్యాక్ గ్రౌండ్‌లో ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడని, వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారని గుర్తుచేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని కూడా వేశారన్నారు. డిసెంబర్ లోపు కచ్చితంగా మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ రావడం ఖాయమని నొక్కి చెప్పారు. 60 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ రిపోర్టు గడువు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.