NTR: గ్యాప్ లేకుండా కష్టపడుతున్న ఎన్టీఆర్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే?

by sudharani |
NTR: గ్యాప్ లేకుండా కష్టపడుతున్న ఎన్టీఆర్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే?
X

దిశ, సినిమా: ఎన్టీఆర్ (NTR) తాజాగా ‘దేవర’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది. ఇక సినిమా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూనే ఉంది.. అప్పుడే ఎన్టీఆర్ మరో చిత్రానికి రెడీ అయిపోయాడు. ఆయన ప్రజెంట్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్‌లో ‘NTR31’ కు సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. దీంతో పాటు మరో చిత్రానికి కూడా డేట్స్ ఇచ్చేశాడు ఎన్టీఆర్.

యశ్ రాజ్ ఫిల్మ్స్ (YRF) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘వార్ 2’ (War 2). బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా తెరకెక్కతున్న ఈ చిత్రంతో ఎన్టీఆర్ (NTR) బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సినిమాలో ఎన్టీఆర్-హృతిక్ రోషన్‌కు మధ్య ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేశారట మేకర్స్. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ మూవీకి సంబంధించి ఎన్టీఆర్-హృతిక్ మధ్య క్లైమాక్స్ ఫైట్ సీన్ ఒక్కటే పెండింగ్ ఉండటంతో దీనికోసం ఎన్టీఆర్ సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఈ ఫైట్ సీన్ ఈ ఏడాది నవంబర్‌లో చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ప్రజెంట్ ఈ న్యూస్ వైరల్ కావడంతో.. గ్యాప్ లేకుండా ఎన్టీఆర్ షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడని తెలుసున్న ఫ్యాన్స్.. మా అన్న డెడికేషన్ అలాంటి అంటూ రియాక్ట్ అవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed