పొట్టుపొట్టు కొట్టుకున్న మహిళా కానిస్టేబుల్, లేడీ లెక్చరర్..

by Sumithra |   ( Updated:2023-03-22 13:03:12.0  )
పొట్టుపొట్టు కొట్టుకున్న మహిళా కానిస్టేబుల్, లేడీ లెక్చరర్..
X

దిశ , నిజామాబాద్ క్రైం : ఇంటర్మీడియట్ పరిక్షా కేంద్రం వద్ధ 144 సెక్షన్ ఉల్లంఘించి, పరీక్షా కేంద్రం వద్ద విద నిర్వహిస్తున్న మహిళ కానిస్టేబుల్ పై చేయి చేసుకున్న లేడీ లెక్చరర్ పై పోలీసులు బుధవారం కేసునమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ నగరంలోని మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఆర్ కాలేజీ వద్ద మంగళవారం విధులు నిర్వహిస్తున్న లేడీ కానిస్టేబుల్ ను కొట్టిన లెక్చరర్ అఫ్రిన్ పై కేసునమోదు చేసినట్లు ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు. కంఠేశ్వర్ లోని ఎస్ఆర్ కాలేజీలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్న సమయంలో పరీక్ష పూర్తి కాకముందే పరీక్ష కేంద్రం గేటు వద్దకు ధర్మపురి హిల్స్ మైనార్టీ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్ గా పనిచేస్తున్న అప్రిన్ వచ్చింది.

కాగా అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళ కానిస్టేబుల్ అఫ్రిన్ ను అడ్డుకుంది. పరీక్షా కేంద్రం వద్దకు రావద్దని మహిళ కానిస్టేబుల్ చెప్పడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవలో అప్రిన్ కానిస్టేబుల్ ను చెంపదెబ్బ కొట్టడంతో ఆమె పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించింది. అనంతరం ఎస్ఆర్ కళాశాల వద్ధ ఉన్న సీసీ కెమెరాలో అప్రిన్ దాడి పుటేజిని పరిశీలించిన పోలీసులు దాని ఆధారంగా చేసుకుని విచారణ జరిపి అఫ్రిన్ పై కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story