పోచారంనకు భారీ షాక్

by Sridhar Babu |
పోచారంనకు భారీ షాక్
X

దిశ, కోటగిరి : మాజీ స్పీకర్, బాన్సువాడ నియోజకవర్గం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. కోటగిరి ఉమ్మడి మండలంలో పోచారంనకు అత్యంత సన్నిహితుడు, ప్రధాన అనుచరుడు, నమ్మిన బంటుగా చెప్పుకునే కోటగిరి ఉమ్మడి మండల ఎంపీపీ వల్లేపల్లి సునీత శ్రీనివాస్ తన అనుచరులతో పాటు సుమారు 500 మంది కార్యకర్తలతో కాంగ్రెస్​లో చేరారు. కోటగిరి మండల కేంద్రంలోని ఏఎస్ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ బాన్సు వాడ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పోచారం ప్రధాన అనుచరులు ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడంతో భారీ షాక్ తగిలిందనే చెప్పవచ్చు.

Advertisement

Next Story