- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నలందలో ఘనంగా అన్యువల్ అవార్డ్స్ ఫంక్షన్..
దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ లోని మామిడిపల్లిలో గల నలంద హై స్కూల్ లో 2022 - 23 విద్యా సంవత్సరంలో సమ్మేటివ్ అసెస్మెంట్ 2 పరీక్ష , ఈ అకాడమిక్ సంవత్సరంలో నిర్వహించినటువంటి అన్ని పరీక్షలలో మొదటి మూడు ర్యాంకులు సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు తల్లిదండ్రుల సమక్షంలో సన్మాన పత్రంతో పాటు మెడల్స్ నీ సోమవారం బహుకరించారు.
ఈ సందర్భంగా నలంద హై స్కూల్ కరస్పాండెంట్ ప్రసాద్ మాట్లాడుతూ వచ్చే నూతన విద్యాసంవత్సరంలో ముందస్తు ప్రణాళిక ప్రకారంగా క్యాలెండర్ ను రూపొందించి తదనుగుణంగా విద్యార్థుల్ని ఉపాధ్యాయుల్ని ఉత్తేజపరిచే విధంగా భవిష్యత్తు కార్య చరణ రూపొందించి ప్రణాళిక ప్రకారంగా ముందు కెళ్తామన్నారు. ప్రిన్సిపాల్ సాగర్ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం తల్లిదండ్రుల తోడ్పాటుతో సమర్థవంతంగా నిర్వహించమని, విద్యార్థుల్ని మునుముందు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సమర్థవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. విద్యా సంవత్సరాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి విద్యార్థులకు తోడ్పడిన, ఉపాధ్యాయ సిబ్బందినీ, ఉపాధ్యయేతర సిబ్బందిని నలంద యాజమాన్యం అభినందించారు.