- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Sri Ramsagar : శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 278 టీఎంసీల వరద నీరు
దిశ,బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ లోకి ఈ సీజన్ లో ఎగువ ప్రాంతాల నుంచి 278 టీఎంసీల వరద నీరు వచ్చి చేరిందని ఎస్ఆర్ఎస్పి సూపరిండెంట్ ఇంజనీర్ శ్రీనివాసరావు గుప్తా తెలిపారు. మెండోరా మండలంలోని పోచంపాడు నీటిపారుదల శాఖ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖరీఫ్ పంటల ప్రారంభ దశలో ప్రాజెక్టులో నీటిమట్టం తక్కువగా ఉన్న ఉన్నతాధికారుల ఆదేశానుసారం నీటి విడుదల ప్రారంభించామన్నారు. వర్షాకాలం సీజన్ ప్రారంభమైన వర్షాలు తక్కువ కురుస్తుండడంతో ఆందోళన చెందామన్నారు. సెప్టెంబర్ మొదటి మాసంలో కురిసిన అధిక వర్షాలతో..ప్రాజెక్టు నిండిపోవడం ప్రారంభించిందన్నారు. వరదలు అధికంగా వస్తున్న సమయంలో ఎస్సారెస్పీ అధికారులు సిబ్బంది అనునిత్యం, అనుక్షణం అప్రమత్తంగా ఉండి ప్రాజెక్టు గేట్ల నిర్వహణ చేపట్టారన్నారు. ప్రాజెక్ట్ ఎగువన దిగువన ఉన్న గ్రామాలకు గాని ప్రజలకు కానీ.. పంటలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా అధికారులకు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. వరదలు ఎక్కువగా రావడంతో.. గోదావరిలోకి 117 టీఎంసీల నీటిని వరద గేట్లు,ఎస్కేగేట్ల ద్వారా వదిలేశామన్నారు. కాకతీయ కాలువకు 34 టిఎంసిలు, వరద కాలువకు 40 టీఎంసీలు, సరస్వతి కాలువకు 2.5 టిఎంసిలు, మిషన్ భగీరథ తాగునీటి కొరకు 3.4 టీఎంసీలు, లక్ష్మీకాలకు 0.17 టీఎంసీల నీటిని విడుదల చేశామన్నారు. ఆవిరి రూపంలో 6.7 టీఎంసీల నీరు పోయిందన్నారు. అదేవిధంగా ప్రస్తుతం ప్రాజెక్టు 1091 అడుగులు 80.5 టీఎంసీ లతో నిండుకుండలా ఉందన్నారు. రబి పంటలకు శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ ఆయకట్టుకు నీటికి డోకా లేదన్నారు.