‘నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచే దమ్ము లేదు.. విశాఖ స్టీల్‌కు టెండర్లు వేస్తారా’

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-10 15:25:27.0  )
‘నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచే దమ్ము లేదు.. విశాఖ స్టీల్‌కు టెండర్లు వేస్తారా’
X

దిశ, తెలంగాణ బ్యూరో: నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచే దమ్ము లేని మీరు విశాఖ స్టీల్ కు టెండర్లు వేస్తారా.. ఎవర్ని మభ్యపెట్టాలని చూస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు.. ఈ నెల 14 న మంచిర్యాల లో జై భారత్ సత్యాగ్రహ బహిరంగ సభ ఉంటుందన్నారు. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారని తెలిపారు. దేశ సంపదను అదానీ, అంబానీలు కొల్లగొడుతున్నారని మండిపడ్డారు.రాహుల్ గాంధీపై కేంద్రంలోని బీజేపీ నిరంకుషంగా వ్యవహరిస్తోందన్నారు. మతం పేరుతో బీజేపీ లూటీ చేస్తోందన్నారు.

ఈ అంశంపై ప్రశ్నించేందుకే సభ నిర్వహిస్తున్నామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌ల మధ్య ఒప్పందంలో భాగంగానే డ్రామా నడుస్తోందన్నారు. సీఎం ప్రధానిని కలిసి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులను ఎందుకు నిలదీయలేదన్నారు. విభజన చట్టంలో కాంగ్రెస్ పొందుపర్చిన హామీలను ప్రశ్నించడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం లా మారిందని ఇప్పటి వరకు బీజేపీ చర్యలు తీసుకోవడం లేదన్నారు. లిక్కర్ కేసులో కవిత తర్వాత నోటీసులు తీసుకున్న వారు అరెస్ట్ అయ్యారని, కవితను ఎందుకు అరెస్ట్ చేయడం లేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌లు ఒకరికొకరు సహకరించుకుంటున్నారని ఫైర్ అయ్యారు.

Also Read..

బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు సుప్రీంకోర్టులో చుక్కెదురు..

Advertisement

Next Story