NIA సోదాలు.. వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ రియాక్షన్ ఇదే..!

by Sathputhe Rajesh |   ( Updated:2024-02-08 05:55:37.0  )
NIA సోదాలు.. వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ రియాక్షన్ ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్ : వీక్షణం ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ నివాసంలో ఎన్ఐఏ సోదాలు ముగిశాయి. దాదాపు ఐదు గంటల పాటు ఎన్ఐఏ ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించింది. తెల్లవారు జాము 4 గంటల నుంచే వేణు ఇంట్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఇటీవల మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యుడు దీపక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీపక్ దగ్గర దొరికిన సమాచారం మేరకు వేణు నివాసంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. అయితే పౌరహక్కుల నేత రవిశర్మ ఇంట్లోను ఎన్ఐఏ సోదాలు ముగిశాయి.

రవిశర్మ సెల్‌ఫోన్, బుక్‌లెట్, కరపత్రాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న నేపథ్యంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. అయితే ఎన్ఐఏ సోదాలపై వేణు గోపాల్ స్పందించారు. నయీమ్ బెదిరింపు లేఖలపై పుస్తకాలు రాశాను అన్నారు. ఆ పుస్తకాలను, నా మొబైల్ ఫోన్‌ను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారని ఎలాంటి నోటీసు ఇవ్వలేదన్నారు.

దీపక్‌కు నాకు సంబంధం ఉందని ఎన్ఐఏ సోదాలు నిర్వహించిందని.. తన పేరును ఎఫ్ఐఆర్‌లో ఎందుకు చేర్చారో తెలియదన్నారు. ఇదే అంశమై ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేశా అన్నారు. తాను ప్రస్తుతం విరసం (విప్లవ రచయితల సంఘం)లో లేను అని వేణుగోపాల్ తెలిపారు. పత్రిక ప్రకటన ద్వారా ఎన్ఐఏ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తామని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.

Advertisement

Next Story