హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాల కలకలం

by M.Rajitha |
హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాల కలకలం
X

దిశ, వెబ్ డెస్క్ : మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది రిజ్వాన్ అబ్దుల్ (Rizwan Abdul) ను ఢిల్లీలో గత ఆగస్ట్ నెలలో ఎన్ఐఏ(NIA) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రిజ్వాన్ కు ఐసిస్(ISIS) ఉగ్రవాద సంస్థతో కీలక సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది. ఐసిస్ యొక్క పూణే మాడ్యూల్స్ లో పని చేసేవాడని అధికారులు నిర్ధారించారు. కాగా రిజ్వాన్ కొంతకాలం హైదరాబాద్(Hyderabad) నగరంలోని పాతబస్తీలో నివాసం ఉన్నట్టు ఎన్ఐఏ గుర్తించింది. దీంతో ఆదివారం ఉదయం నగరంలోని సైదాబాద్ గ్రీన్ వ్యూ అపార్ట్మెంట్ లో సోదాలు నిర్వహించి, పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అలాగే రిజ్వాన్ తో సంబంధం ఉన్న నగరానికి చెందిన మరికొంతమందిని కూడా ఎన్ఐఏ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో కేంద్ర హోంశాఖ రిజ్వాన్ మీద రూ.3 లక్షల రివార్డ్ ప్రకటించింది.

Advertisement

Next Story