మైదానంలోకి దూసుకొచ్చిన కోహ్లీ ఫ్యాన్.. విరాట్‌ భుజాలపై చేతులేసి

by Harish |
మైదానంలోకి దూసుకొచ్చిన కోహ్లీ ఫ్యాన్.. విరాట్‌ భుజాలపై చేతులేసి
X

దిశ, స్పోర్ట్స్ : భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో శుక్రవారం ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మెల్‌బోర్న్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అయితే రెండో రోజు ఆసిస్ ఇన్నింగ్స్‌లో కోహ్లీ అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు. నేరుగా కోహ్లీ దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. విరాట్‌ భుజాలపై చేతులేసాడు. కోహ్లీ కూడా కోపం తెచ్చుకోకుండా ఫ్యాన్‌‌తో నవ్వుతూ మాట్లాడాడు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది సదరు అభిమానిని మైదానం బయటకు తీసుకెళ్లారు. దాంతో కాసేపు మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. ఆ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, సదరు అభిమాని మైదానంలోకి దూసుకరావడం ఇదే తొలిసారి కాదు. గతేడాది వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌ మ్యాచ్‌లోనూ కోహ్లీ కోసం అతను మైదానంలోకి వచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed