హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో NIA చార్జిషీట్

by Satheesh |
హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో NIA చార్జిషీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చార్జీషీట్ దాఖలు చేసింది.ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను హైదరాబాద్ పోలీసుల నుంచి గత జనవరిలో తీసుకున్న ఎన్ఐఏ బుధవారం చార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో అధికారులు సంచలన విషయాలు పేర్కొన్నారు. నిందితులు అబ్దుల్ జాహెద్, సమీయుద్దీన్, మాజ్ హసన్‌లు ఉగ్రకార్యకలాపాలకు నిధుల సమీకరణ కోసం కుట్ర పన్నారని, పేలుడు పదార్థాలను సేకరించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. వీరికి ఉగ్రవాది ఫర్తుల్లా ఘోరీతో సంబంధాలు ఉన్నాయని దసరా నాడు హైదరాబాద్ రద్దీ ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర పన్నారని అభియోగాలు మోపింది.

Advertisement

Next Story

Most Viewed