- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NHRC: లగచర్ల ఘటనను సుమోటోగా స్వీకరించిన NHRC.. సీఎస్, డీజీపీలకు కీలక ఆదేశాలు
దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లా (Vikarabad District) దుద్యాల మండలం (Dudyala Mandal) లగచర్ల (Lagacharla)లో కలెక్టర్, అధికారులపై రైతుల దాడి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధిత రైతుల ఫిర్యాదు మేరకు ఘటనను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ (National Human Rights Commission) రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి (CS Shanthi Kumari), డీజీపీ జితేందర్ (DGP Jithender)కు నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా తక్షణ పరిశీలన కోసం తమ అధికారుల బృందాన్ని సంఘటనా స్థలానికి పంపించాలని కూడా నిర్ణయించింది. కాగా, ఫార్మా కంపెనీ భూ నిర్వాసితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ.. ఈనెల 18న ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)ను ఆశ్రయించారు. దీంతో వారి అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న ఎన్‌హెచ్‌ఆర్సీ (NHRC) తాజాగా సీఎస్ (CS), డీజీపీ (DGP)లకు నోటీసులు జారీ చేసింది.