Musi : సుందీకరణ కాదు.. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు : దేశవ్యాప్త ఆందోళనకు సిద్దమవుతున్న ఎన్జీవోస్

by M.Rajitha |
Musi : సుందీకరణ కాదు.. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు : దేశవ్యాప్త ఆందోళనకు సిద్దమవుతున్న ఎన్జీవోస్
X

దిశ, తెలంగాణ బ్యూరో : మూసీ(Musi) విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది మూసీ పునరుజ్జీనం ప్రాజెక్టుకాదని, ఓ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు అని పలు స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ సంస్థలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 100 మంది పర్యావరణ వేత్తలు, మాజీ ప్రొఫెసర్లు, లాయర్లు, తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో దేశ వ్యాప్త ఉద్యమానికి సిద్దమవుతున్నట్టు నేషనల్ అలయెన్స్ ఆఫ్ పీపుల్స్ మూమెంట్స్(NAPM) తెలంగాణ ప్రతినిధి జాన్ మైకెల్ తెలిపారు. మూసీ పునరుజ్జీనం ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్, పునరావాస పాలసీ లేకుండా ఆక్రమణల పేరుతో ప్రజలను ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. మూసీలోకి వస్తున్న మురుగునీటి, చెత్త చెదారం, రసాయన పరిశ్రమల నుంచి వస్తున్న కెమికల్స్ ను రాకుండా చేయాల్సిన ప్రభుత్వం గోదావరి నీళ్లు పారిస్తే క్లీన్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. మూసీకి సంబంధించిన ఎఫ్టీఎల్, బఫర్ జోన్లపై ప్రజలకు అవగాహన కల్పించకుండా 100 మీటర్ల లోపు ఉన్న ఇండ్లను కూడ తొలగించడానికి అధికారులు చర్యలు తీసుకోవడం శోచనీయమన్నారు. మూసీ పునరుజ్జీనం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. మూసీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.

Advertisement

Next Story