- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్, బీజేపీ మోసాలు ఇక చాలు.. నెక్ట్స్ కాంగ్రెస్‌దే అధికారం: రోహిన్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: యూత్ డిక్లరేషన్‌తో మార్పు మొదలు కానున్నదని కాంగ్రెస్ నేత రోహిన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌దే అధికారమన్నారు. బీఆర్ఎస్, బీజేపీ మోసాలను ప్రజలు భరించే స్థాయిలో లేరన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మార్పు కోసం కాంగ్రెస్‌కు ఓటు వేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. 1200 మంది యువత ప్రాణాలు బలిదానం చేసుకోవడం వల్ల వచ్చిన తెలంగాణను ఆగం పట్టించారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో తెలంగాణ వస్తే ఆ లక్ష్యాన్ని ఇప్పటికీ నెరవేర్చకపోవడం బాధాకరమన్నారు. సొంత కుటుంబానికి ఉద్యోగలిచ్చిన కేసీఆర్.. తెలంగాణ యువతను మర్చిపోయారన్నారు. నోటిఫికేషన్‌ల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి దేశ్ కీ నేత పేరుతో కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. యువత, నిరుద్యోగులు కాంగ్రెస్‌కు అండగా ఉండాల్సిన అవసరం ఉన్నదని రోహిన్‌రెడ్డి స్పష్టం చేశారు.