చంద్రబాబు అరెస్ట్ వ్యక్తిగతంగా బాధించింది: మంత్రి తలసాని

by srinivas |   ( Updated:2023-10-04 11:35:31.0  )
చంద్రబాబు అరెస్ట్ వ్యక్తిగతంగా బాధించింది: మంత్రి తలసాని
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. 73 ఏళ్ల వయస్సులో ఉన్న చంద్రబాబును అరెస్ట్ చేయడం సరికాదన్నారు. హైదరాబాద్ ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ చంద్రబాబు అరెస్ట్ వ్యక్తిగతంగా తనకెంతో బాధకలిగించిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా, కేంద్రంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడం, విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. అధికారం శాశ్వతం కాదని, చంద్రబాబు పట్ల వైసీపీ తీరు విచారకరమని తలసాని పేర్కొన్నారు.

Advertisement

Next Story