- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
HYD: న్యూ ఇయర్ ఎఫెక్ట్.. 100 గ్రాముల కొకైన్ పట్టివేత
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: కాసేపట్లో హైదరాబాద్ నగర వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన కూడలిలో, పబ్స్ ఏరియాల్లో పోలీసులు నిఘా పెంచారు. రాత్రి 8 గంటల నుంచి సిటీ మొత్తం ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రధానంగా డ్రగ్స్‌పై దృష్టి సారించారు. డ్రగ్స్ నియంత్రణకు తనిఖీలు ముమ్మరం చేశారు. తాజాగా.. జూబ్లీహిల్స్‌లో పోలీసులు జరిపిన తనిఖీల్లో రూ.7.50 లక్షల విలువైన 100 గ్రాముల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు.. కొకైన్ తరలిస్తున్న నవీన్, సాయి అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు మీర్‌పేట్‌లో డ్రగ్స్ తరలిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో వాడేందుకు రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు గుర్తించారు.
Advertisement
Next Story