బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్.. ఎన్నికల వేళ షాక్ ఇస్తున్న క్యాడర్

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-03 14:48:13.0  )
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్.. ఎన్నికల వేళ షాక్ ఇస్తున్న క్యాడర్
X

ఎన్నికల సమీపిస్తుండగా అధికార పార్టీ నేతలకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. సొంత పార్టీ క్యాడర్​ను కాపాడుకోవడానికి నానా తంటాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వచ్చే ఎన్నికల్లో సహకరించాలంటే తమకు పైసలు ఇస్తారా..? లేక నామినేటెడ్​ పదవులు ఇస్తారా..? అంటూ ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. పలు చోట్ల ఇప్పటికే ఇటువంటి ఘటనలు తెరమీదకు రాగా మరి కొన్నిచోట్ల గుట్టు చప్పుడు కాకుండా అడిగినంత ఇచ్చినా క్యాడర్​ చేజారి పోకుండ కాపాడుకునేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుతం ఉన్న క్యాడర్​ను కాపాడుకోవడం పెద్ద సవాల్​గా మారింది.

వచ్చే ఎన్నికల్లో తిరిగి విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలకు క్యాడర్​ను కాపాడుకోవడమే తక్షణ కర్తవ్యంగా మారింది. అయితే తమ అండదండలతో గతంలో విజయం సాధించిన ఎమ్మెల్యేలు తరువాత తమను పట్టించుకోలేదని పార్టీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తమ కోర్కెలు నేరవేర్చుకునేందుకు ఇదే సరైన సమయమని భావిస్తూ నేతలపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. పార్టీ టికెట్​ ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో తమ పరపతి దెబ్బతినకుండా అడిగినంత ఇచ్చి లీడర్లను కాపాడుకునే పనిలో పడ్డారు బీఆర్​ఎస్​ ప్రజాప్రతినిధులు. - దిశ, కరీంనగర్​ బ్యూరో

ఎన్నికల సమయంలో అధికార పార్టీ నేతలు సొంత పార్టీ క్యాడర్​ను కాపాడుకోవడానికి నానా తంటాలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో సహకరించాలంటే తమకు పైసలు ఇస్తారా..? లేక నామినేటెడ్​ పదవులు ఇస్తారా..? అంటూ ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. కోరిన కొర్కేలు తీర్చకుంటే రాజీనామాలు చేస్తామంటూ అధికార పార్టీ నేతలకు సొంత​ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. పలు చోట్ల ఇప్పటికే ఇటువంటి ఘటనలు తెరమీదకు రాగా మరి కొన్నిచోట్ల గుట్టు చప్పుడు కాకుండా అడిగినంత ఇచ్చినా క్యాడర్​ చేజారి పోకుండ కాపాడుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు.

కాపాడుకోవడమే పెద్ద సవాల్​...

అధికార పార్టీకి ప్రస్తుతం ఉన్న క్యాడర్​ను కాపాడుకోవడం పెద్ద సవాల్​గా మారింది. వచ్చే ఎన్నికల్లో తిరిగి విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సొంత పార్టీ క్యాడర్​ను కాపాడుకోవడమే తక్షణ కర్తవ్యంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ అండదండలతో విజయం సాధించిన తరువాత ఎమ్మెల్యేలు తమను పట్టించుకోవడం లేదని అధికార పార్టీ కార్యకర్తలు కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల తరువాత సొంత పనులు చక్కదిద్దుకునే పనిలో ఉన్నారు తప్పా కార్యకర్తల బాగోగులు చూసిన పాపన పోలేదని వాపోతున్నారు. ప్రస్తుతం ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అనుకున్న పదవి లేదా ఆర్థిక ఇబ్బందులు లేకుండా అడిగినంత డబ్బు ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారు. తన కోర్కెలు నేరవేర్చుకోవడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్న పార్టీ క్యాడర్​ నేతలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. కోరిన కోర్కెలు తీర్చకుంటే రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.

రూ.10లక్షల వరకు డిమాండ్​..

గ్రామ, మండలస్థాయి నాయకులు ఆయా నియోజకవర్గ, జిల్లాస్థాయి వరకు ఉన్న నామినేట్​ పోస్టులు ఆశిస్తున్నారు. నామినేట్​ పదవులు రాకుంటే పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్​ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో ప్రజాప్రతినిధుల నుంచి మొదలుకొని పార్టీ పదవుల్లో ఉన్న వారు సైతం ఉన్నట్లు తెలస్తోంది. వారి వారి స్థాయిని బట్టి రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు డిమాండ్​ చేస్తున్నారని బీఆర్​ఎస్​ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. వీరి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండడంతో బీఆర్​ఎస్​ నేతల్లో గుబులు మొదలైంది. అడిగినంత ఇచ్చి కాపాడుకోకుంటే క్యాడర్​ చేజారి పోయే ప్రమాదం ఉందని ఇది పార్టీ అధిష్టానం దృష్టిలో పడితే టికెట్​ కష్టంగా మారే పరిస్థితి ఉంది. వచ్చే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్​ పార్టీ టికెట్​ ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో పార్టీలో పోటీ ఎక్కువ కావడంతో పార్టీలో పరపతి దెబ్బతినకుండా అడిగినంత ఇచ్చి లీడర్లను కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పడ్డారు.

Also Read...

బీఆర్ఎస్‌లో మొదలైన టెన్షన్.. అధికార పార్టీలో ‘అసద్’ లొల్లి!

Advertisement

Next Story