- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ మరో కీలక నిర్ణయం.. బీఆర్ఎస్‌కు మరో షాక్ తప్పదా?
దిశ, తెలంగాణ బ్యూరో: రుణమాఫీ అంశంలో బీఆర్ఎస్‌ను ఇరకాటంలో పెట్టేందుకు కాంగ్రెస్ సరికొత్త వ్యూహాన్ని ఎంచుకున్నది. గత కొన్ని రోజుల నుంచి రుణమాఫీ అంశంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్ల మధ్య విమర్శలు, కౌంటర్లు కొనసాగుతున్నాయి. ఇరు పార్టీలకు చెందిన నేతలు ప్రెస్ మీట్లు, మీటింగ్‌లు, సోషల్ మీడియాల్లో పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో ప్రజలకు ఓ స్పష్టత ఇవ్వాలని టీపీసీసీ కీలక నిర్ణయం తీసుకున్నది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో జరిగిన రుణమాఫీ వివరాలను స్పష్టంగా ప్రజల ముందు పెట్టనున్నారు. 8 కాలమ్స్‌లో రెండు ప్రభుత్వాల హయంలో జరిగిన స్కీమ్ అమలు తీరును వివరించనున్నారు. మార్కెట్లు, మండలకేంద్రాలు, రైతు వేదికల్లో ప్రదర్శించనున్నారు. జిల్లా కేంద్రాలలోని వివిధ కూడళ్ల వద్ద భారీ స్థాయిలో ఫ్లెక్సీల ఏర్పాటుకూ ప్రణాళిక తయారు చేస్తున్నారు. టీపీసీసీ ఇప్పటికే నిర్ణయం తీసుకోగా, అన్ని జిల్లాల డీసీసీలకు ఆదేశాలు జారీ చేయనున్నది.
హస్తం పార్టీ సర్కారు రుణమాఫీ చేసిందిలా..
ఈ ఏడాది జూలై 15న రుణమాఫీకి జీవో రిలీజ్ చేసిన కాంగ్రెస్ సర్కారు ఏకకాలంలోనే రూ.2 లక్షల వరకు రుణమాఫీని అమలు చేసింది. రూ.17,933.19 కోట్లతో 22,37,848 లబ్ధిదారులకు రుణమాఫీ జరిగిందని ప్రభుత్వం వెల్లడించింది. పవర్‌లోకి వచ్చిన 8 నెలల్లోనే మొదటి పంటకాలంలో ఆగస్టు 15 నాటికి రూ.18 వేల కోట్లతో రుణామఫీ చేశామని, బడ్జెట్‌లో రూ.31 వేల కోట్లు పొందుపరిచామని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంటున్నది.
బీఆర్ఎస్ హయంలో ఇలా...
బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీకి 2014 ఆగస్టు 13న, 2020 మార్చి 17న జీవోలు విడుదల చేసింది. 2014 రుణమాఫీని నాలుగేండ్ల పాటు 4 వాయిదాలలో చేశారు. ఇందుకు వరుసగా 2014 నుంచి 2018 వరకు రూ.4,040 కోట్లు, రూ.4,040 కోట్లు, రూ.4,025 కోట్లు, రూ.4,038 కోట్లు చొప్పున విడుదల చేశారు. అయితే వీటి వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని, అసలు అలాగే ఉండగా, వడ్డీకి సర్దుబాటు చేశారని కాంగ్రెస్ వివరిస్తున్నది. 2018లో రుణమాఫీని మూడేండ్ల పాటు కొనసాగించారు. 2014లో కేవలం వడ్డీ మాఫీ జరగగా, 2018లో అసలు కంటే వడ్డీకే సర్దుబాటు ఎక్కువగా జరిగిందని కాంగ్రెస్ ప్రచారం చేయనున్నది. 2014లో రూ.16,144 కోట్లు, 2018లో 11,910 కోట్లు చొప్పున మాత్రమే నిధులు కేటాయించారని కాంగ్రెస్ వెల్లడించనున్నది.