- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
New Ration Cards: కొత్త రేషన్ కార్డుల జారీకి సర్కార్ కీలక నిర్ణయం.. ఆ ముగ్గురితో సబ్ కమిటీ
దిశ, వెబ్‌డెస్క్: కళ్లు కాయలు కాసేలా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు కొత్త కార్డుల జారీకి సర్కార్ కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. కాగా, ఆ కమిటీకి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్‌గా వ్యహరించనున్నారు. సభ్యులుగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహను నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులతో సహా కొత్త కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులపై సబ్ కమిటీ కలెక్టర్లతో కలిసి పూర్తిగా అధ్యయనం చేయనుంది. కొత్త రేషన్ కార్టుల జారీలో అవలంభించాల్సిన విధివిధానాలను కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలామంది నిరుపేదలు దరఖాస్తు చేసుకున్నా వారికి నిరాశే ఎదురైంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కొలుదీరాక ప్రజాపాలనలో భాగంగా లక్షలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు రేషన్ కార్డ్ ప్రామాణికం కావడంతో కొత్త రేషన్ కార్డులు ఎప్పుడొస్తాయా అని సామాన్య జనం వేచి చూస్తున్నారు.