- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
న్యూజెర్సీ టూ మలక్‌పేట.. ఓటేసేందుకు వచ్చిన ప్రవాస భారతీయుడు
దిశ, తెలంగాణ బ్యూరో : దేశ వ్యాప్తంగా జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రవాస భారతీయుడు తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి స్వదేశానికి చేరుకున్నారు. మలక్‌పేటకు చెందిన అరవింద్ గత 20 ఏళ్ల క్రితం ఉద్యోగ రీత్యా అమెరికా వెళ్లారు. కాగా, ఆయన కుటుంబసభ్యులతో కలిసి న్యూ జెర్సీలో నివసిస్తున్నాడు. సోమవారం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండడంతో అమెరికా నుంచి బయలుదేరి ఆదివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. సోమవారం మలక్‌పేటలోని హాస్మన్‌ఘాట్‌లో ఉన్న గౌతమ్ మోడల్ స్కూల్‌లో పోలింగ్ బూత్ నెం.73లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అతడితో పాటు 92 ఏళ్ల ఆయన తండ్రి గిపాలన్ నదాతుర్ కూడా ఓటు వేశారు. ఇక్కడే ఉండి పోలింగ్ బూత్ పక్కన ఉన్న కూడా కొంత మంది ఓటు వేయకుండా, సేద తీరేందుకు విహార యాత్రకు వెళ్తున్నారు. అలాంటిది ఓటు కోసం న్యూజెర్సీ నుంచి రావడంపై ఆయనను ప్రశంసిస్తున్నారు. విదేశాల్లో ఉండి ఓటు కోసం వచ్చిన వారిని స్థానిక ఓటర్లు స్ఫూర్తిగా తీసుకుంటే మంచిదంటూ పలువురు అధికారులు చెప్పడం గమనార్హం.