- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్కూళ్లకు రెండ్రోజులు సెలవులు.. విద్యాశాఖపై విమర్శలు
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో గత రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై పలువురు నెటిజన్లు, రాజకీయ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రెండు రోజులుగా వర్షాలు కురుస్తుంటే.. ఇవాళ ప్రకటన ఇవ్వడంపై మండిపడ్డారు. ‘మేడం.. సబితా గారు... తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని మొన్ననే వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. మొన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా మబ్బు పట్టి రోజంతా జల్లులు పడుతూనే ఉన్నాయి. ఈరోజు అందరూ బడులకు వెళ్లేందుకు సిద్ధమై, చాలామంది స్కూల్లకు చేరుకున్న తర్వాత ఈరోజు, రేపు సెలవు అని ప్రకటించడం ఏమిటి? కనీసం రేపటి నుంచి సెలవులు అని ప్రకటించినా మీ నిర్ణయం సరైనదిగా అనిపించేది. ప్రభుత్వంలో ఉన్నవాళ్లు అప్రమత్తంగా లేకుంటే ఇలాంటి నిర్ణయాలే వస్తాయి.’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తూ.. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను చూస్తూ ఉదయం 9 గంటలకు స్పందించి సెలవులు ప్రకటించాలని ఈరోజు ఫాంహౌజ్ నుంచి ఆదేశాలు జారీ చేసిన సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు అని పేర్కొన్నారు. పిల్లలు స్కూల్ వెళ్లిన తర్వాత నిద్ర లేచి విద్యాలయాలకు సెలవులు ప్రకటించిన విద్యా శాఖ మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ సెటైర్లు వేశారు.