ఆరని వీధి దీపాలు! ఓ వైపు ప్రభుత్వం విద్యుత్ పై ఫోకస్.. మరోవైపు అధికారుల నిర్లక్ష్యం

by Ramesh N |   ( Updated:2024-03-09 14:17:23.0  )
ఆరని వీధి దీపాలు! ఓ వైపు ప్రభుత్వం విద్యుత్ పై ఫోకస్.. మరోవైపు అధికారుల నిర్లక్ష్యం
X

దిశ, డైనమిక్ బ్యూరో: నగరంలో పలు చోట్ల పట్టపగలు వీధి దీపాలు ఆపడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మిట్టమధ్యాహ్నం అయినా కూడా ఆ స్ట్రీట్ లైట్స్ వెలుగుతూనే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మిట్టమధ్యాహ్నం అయినా స్ట్రీట్ లైట్స్ ఆపడం లేదని,హైదరాబాద్ ఫిల్మ్ నగర్ నుంచి షేక్ పేట్ నాలా రోడ్డులో గత రెండు రోజులుగా నిరంతరాయంగా స్ట్రీట్ లైట్స్ వెలుగుతూనే ఉన్నాయని సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు.

ఓ వైపు విద్యుత్ మీద ప్రభుత్వం ఫోకస్, మరోవైపు విద్యుత్, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. నగరంలోని చాలా ఏరియాల్లో ఇలానే వీధి దీపాలు ఆఫ్ చేయకుండా వదిలేస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అన్ని గవర్నమెంట్లలో అన్నిచోట్లా ఇలానే ఉంది. పగలు అయితే ఆటోమేటిక్ ఆఫ్ అయ్యే టెక్నాలజీ పెట్టాలని నెటిజన్లు సూచించారు.

Advertisement

Next Story