- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రికార్డుల్లో తప్పుడు లెక్కలు.. చెత్తకుప్పలో రోగులకు అందాల్సిన మెడిసిన్లు!
దిశ, మద్దూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఉచిత వైద్యంతో పాటు మెడిసిన్లనూ సరఫరా చేస్తున్నది. అయితే, మద్దూరు మండల కేంద్రంలోని ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మెడిసిన్లు చెత్త కుప్పల పాలు అవుతున్నాయి. రోగులకు అందించాల్సిన మందులు, గ్లూకోజ్ బాటిళ్లను నామమాత్రంగా అందిస్తూ, రికార్డుల్లో తప్పుడు లెక్కలు రాస్తున్నట్లు సమాచారం. మిగిలిన మెడిసిన్ బాటిళ్లను బాక్సులతో సహా ఆరోగ్యకేంద్రం వెనకాల ఉన్నా చెత్తకుప్పలో పడేసి బూడిద పాలు చేస్తున్నారు.
వికలాంగులకు కోసం అందుబాటులో ఉంచిన వీల్ చైర్లను మూలానపడేశారు. దీంతో హెల్త్ సిబ్బందిపై స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్తాయి అధికారుల పర్యవేక్షణ లోపంతోనే స్థానిక అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. వైద్యారోగ్య శాఖమంత్రి హరీష్ రావు మద్దూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేసి ప్రజాదనాన్ని దుర్వినియోగం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.