- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నీట్ నోటిఫికేషన్ రిలీజ్
దిశ, తెలంగాణ బ్యూరో: ఎంబీబీఎస్, బీడీఎస్, బీహెచ్‌ఎంఎస్ తదితర అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్) నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం విడుదల చేసింది. సోమవారం రాత్రి 9 గంటల నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే నెల 6వ తేదీ అర్ధరాత్రి వరకూ దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఇచ్చింది. జనరల్ అభ్యర్థులు రూ.1700, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1600, ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జండర్, దివ్యాంగులు రూ.వెయ్యి ఎగ్జామ్ ఫీజు కోసం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.
ఈ ఏడాది ఐదో నెల 7వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల 20 నిమిషాల వరకూ ఎగ్జామ్ ఉంటుందని స్పష్టం చేసింది. ఎగ్జామ్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ సబ్జెక్ట్స్ నుంచి 200 మల్టీపుల్ చాయిస్ క్వశన్స్ ఉంటాయని తెలిపింది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు సహా 13 భాషల్లో ఎగ్జామ్ నిర్వహిస్తామని ఎన్‌టీఏ పేర్కొంది. ఏ లాంగ్వేజ్‌లో ఎగ్జామ్ రాస్తారో దరఖాస్తు సమయంలోనే ఆప్షన్ ఎంచుకోవాలని సూచించింది. బీఎస్సీ నర్సింగ్, మిలిటరీ నర్సింగ్ సర్వీస్ కోర్సుల్లో ప్రవేశాలను సైతం నీట్ మార్కుల ఆధారంగానే భర్తీ చేయనున్నారు.