- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి: బీర్ల అయిలయ్య
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ అభివృద్ధిలో ఎన్ఆర్‌ఐలు భాగస్వామ్యం కావాలని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. లండన్ లో ఎన్‌ఆర్‌ఐలు నిర్వహించిన మీట్ గ్రీట్ ప్రోగ్రామ్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ...కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎన్నారైలు ముఖ్యపాత్ర వహించారన్నారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా వివిధ దేశాల్లో పర్యటించి ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులు అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చారన్నారు. తెలంగాణలోని యువత ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, సరే ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునే విధంగా తీర్చిదిద్దడానికి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని స్థాపిస్తున్నామని వివరించారు.
మూసీ నది ప్రక్షాళన కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంతో పోటీ పడే విధంగా తయారు చేయబోతున్నామన్నారు. మూసీ నదిని అభివృద్ధి చేసి పెట్టుబడులు ,వ్యాపార కార్యక్రమాలు పెంపొందించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందన్నారు. లండన్ లోని థీమ్స్ నది, దక్షిణ కొరియా రాజధాని సీయోల్ లో ఉన్న చుంగెచాన్ నదిల కంటే కూడా గొప్పగా మూసీ నదిని ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదన్నారు. డ్రగ్స్ ,మాదకద్రవ్యాల నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించిందన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్నారై విభాగం ప్రతినిధులు గంప వేణుగోపాల్ ,సుధాకర్ గౌడ్ , సుబ్బురు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.