Navodaya: నిరుద్యోగులకు భారీ గుడ్‌ న్యూస్.. రాత పరీక్ష లేకుండానే 500 టీచర్‌ పోస్టులు

by Shiva |
Navodaya: నిరుద్యోగులకు భారీ గుడ్‌ న్యూస్.. రాత పరీక్ష లేకుండానే 500 టీచర్‌ పోస్టులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగం కోసం చెప్పులరిగేలా తిరుగుతున్న నిరుద్యోగులకు నవోదయ విద్యాలయ సమితి గుడ్ న్యూస్ చెప్పింది. జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2024-2025 విద్యా సంవత్సరానికి గాను టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 500 టీజీటీ, పీజీటీ పోస్టులను భర్తీ చేయనుండగా.. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు భోపాల్‌ ప్రాంతీయ కార్యాలయం కాంట్రాక్ట్ ప్రాతిపదికన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో ఉన్న జవహర్ నవోదయాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు అధికారికంగా ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. మొత్తం పోస్టులు 500 ఉండగా.. అందులో టీజీటీ పోస్టులు 283, పీజీటీ పోస్టులు 217 ఉన్నాయి.

హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్‌, సైన్స్, సోషల్ సైన్స్, ఒరియా, కంప్యూటర్ సైన్స్, మ్యూజిక్, ఆర్ట్, ఒకేషనల్, లైబ్రేరియన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి పోస్టులకు ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ, బీఈడీ, సీటెట్‌ ఉత్తీర్ణతతో అభ్యర్థులు బోధనా అనుభవం కలిగి ఉండాలి. పీజీటీలకు నెలకు రూ.42,250, టీజీటీలకు నెలకు రూ.40,625 వేతనం ఇవ్వనున్నారు. విద్యార్హత, పని అనుభవం, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగనుంది. దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 26 చివరి తేదీ. పూర్తి వివరాలకు https://drntruhs.in/jnv-tgt-pgt-recruitment/ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని నవోదయ విద్యాలయ సమితి అధికారులు తెలిపారు.

Advertisement

Next Story