- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాటు నాటుకు ఆస్కార్ : తెలంగాణ యాసకు పట్టాభిషేకం
దిశ, వెబ్‌డెస్క్: విశ్వ యవనికపై నాటు నాటు సాంగ్ ప్రత్యేక గుర్తింపు సాధించి ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుంది. దేశమంతా ప్రస్తుతం ఈ పాట గురించి ప్రత్యేక చర్చ సాగుతోంది. ఈ పాటకు ఎన్టీఆర్, రామ్ చరణ్ స్టెప్పులు హైలెట్‌గా నిలిచాయి. ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిని ఆస్కార్ మన తెలుగు సినిమా సాధించడం పట్ల రెండు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది. అవార్డుల కుంభస్థలాన్ని బద్దలు కొడుతూ నాటు నాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఉత్తమ పాటగా అవార్డు సొంతం చేసుకుంది. దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూసిన క్షణం రానే వచ్చేసింది. 95వ ఆస్కార్ వేడుకలో ఆర్ ఆర్ ఆర్ సినిమా తెలుగోడి సత్తా చాటింది.
తెలంగాణ యాసలో పాట..
రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించిన ఈ పాటలో తెలంగాణ యాసను గేయ రచయిత చంద్రబోస్ వినసొంపుగా రాశారు. సెవులు సిల్లు పడేలా, ఏలు సిటికెలేసేలా, కాలు సిందు తొక్కేలా, ఒల్లు సెమటపట్టేలా, వొంటిలోని రగతమంతా రంకలేసి ఎగిరేలా, లోపలున్న పానమంతా వాంటి తెలంగాణ వాడుక భాషను నాటు నాటు పాటలో చంద్రబోస్ అందంగా తీర్చిదిద్దారు. ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆస్కార్ వచ్చిన సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ఇదే అంశాన్ని తన సందేశంలో మెన్షన్ చేశారు.
ఆస్కార్ అవార్డు పొందిన నాటు నాటు పాటలో పొందు పరిచిన పదాలు.. తెలంగాణ సంస్కృతికి, తెలుగు ప్రజల అభిరుచికి ప్రజా జీవన వైవిధ్యానికి అద్దం పట్టాయని సీఎం అన్నారు. ప్రస్తుతం నాటు నాటు పాటకు దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. దేశం గర్వించేలా చేశారంటూ నెటిజన్లు సైతం కామెంట్ చేస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ గతేడాది విడుదలపై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రూ. 1000కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. గోల్డెన్ గ్లోబ్, సినీ క్రిటిక్స్ అవార్డులను సొంతం చేసుకుంది.