మేనిఫెస్టో తెలంగాణ కాంగ్రె‌స్‌కు విరుద్దం! పార్టీ ఫిరాయింపులు ఇక్కడ వర్తించవా?

by Ramesh N |   ( Updated:2024-04-06 17:36:33.0  )
మేనిఫెస్టో తెలంగాణ కాంగ్రె‌స్‌కు విరుద్దం! పార్టీ ఫిరాయింపులు ఇక్కడ వర్తించవా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్ ‘న్యాయ్‌పత్ర’ పేరుతో ఢిల్లీలో మేనిఫెస్టోను ప్రకటించారు. ఈ మేనిఫెస్టోలో అనేక అంశాలు వెల్లడించారు. కానీ ఒక అంశం మాత్రం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి విరుద్ధంగా ఉందని సోషల్ మీడియాలో మేనిఫెస్టో చక్కర్లు కొడుతోంది.

రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో భాగంగా కొన్ని అంశాలను మేనిఫెస్టోలో ప్రస్తావించారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను సవరించి, పార్టీ ఫిరాయింపులకు పాల్పడే ఎమ్మెల్యే లేదా ఎంపీలపై అసెంబ్లీ లేదా పార్లమెంట్‌ సభ్యత్వానికి అనర్హత వేటు వేస్తామని హామీ ఇచ్చింది.

కానీ తెలంగాణలో కాంగ్రెస్‌లో భారీ సంఖ్యలో ఇతర పార్టీల నేతలు చేరుతున్నారు. బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సంగతి తెలిసిందే. దీంతో పార్టీ మేనిఫెస్టో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి విరుద్దంగా ఉందని సోషల్ మీడియాలో పార్టీ మేనిఫెస్టోపై సెటైర్లు వేస్తున్నారు. మరి ఇక్కడ పార్టీలో చేరిన వారిపై అనర్హత వేటు వేస్తారా? వారి సభ్యత్వం తొలగిస్తారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed