నార్కెట్‌పల్లి డిపోకు పూర్వ వైభవం తీసుకొస్తాం : మంత్రి పొన్నం

by Bhoopathi Nagaiah |   ( Updated:2024-07-13 07:16:33.0  )
నార్కెట్‌పల్లి డిపోకు పూర్వ వైభవం తీసుకొస్తాం : మంత్రి పొన్నం
X

దిశ, నల్లగొండ బ్యూరో : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న నార్కెట్‌పల్లి బస్ డిపోకు పూర్వ వైభవం తీసుకొస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో నల్లగొండ టు హైదరాబాద్ నాన్ స్టాప్ ఏసీ బస్సులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నార్కెట్‌పల్లి డిపోకు పూర్వ వైభవం తీసుకురావడానికి అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఆర్టీసీ రీజినల్ మేనేజర్‌ను ఆదేశించారు. ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రావాల్సిన రూ.280 కోట్లలో ఇప్పటికీ కేవలం రూ.80 కోట్లు మాత్రమే ఇచ్చామని, మిగతా రూ.200 కోట్లు ఈనెల చివరి నాటికి అందజేస్తామని తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉండడం వల్ల ఆలస్యమైందని, అందుకు క్షమించాలని ఆర్టీసీ కుటుంబ సభ్యులను కోరారు. జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గ కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి నాన్ స్టాపులు బస్సులు నడిచేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Next Story