కొనసాగుతున్న జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ

by Sathputhe Rajesh |   ( Updated:2024-06-18 07:27:09.0  )
కొనసాగుతున్న జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోలు అంశంపై జస్టిస్ నరసింహారెడ్డి క మిషన్ విచారణ కొనసాగుతోంది. మంగళవారం విద్యుత్ శాఖ అధికారి రఘు, ప్రొఫెసర్ కొదండరాం విచారణకు హాజరయ్యారు. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్ల అంశంలో విచారణ ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కాగా.. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం, ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుపైనా జ్యుడీషియల్ కమిషన్ విచారణ చేపట్టింది. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను రఘు అధికారులకు అందించారు. తక్కువ ధరకే రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి అవుతున్నా అదనపు ధరలు వెచ్చించి విద్యుత్ కొనుగోలు చేసినట్లు విచారణకు హాజరైన రఘు వెల్లడించినట్లు తెలిసింది. ఇక, తాజాగా విచారణ కమిషన్ చైర్మన్‌కు కేసీఆర్ 12 పేజీల లేఖ రాసి ఎంక్వైరీ పారదర్శకంగా జరగడం లేదని ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే తాజా విచారణ అనంతరం కమిషన్ తీసుకునే చర్యలపై ఉత్కంఠ నెలకొంది.



Advertisement

Next Story

Most Viewed