మరోసారి విచారణకు నందకుమార్ భార్య చిత్రలేఖ

by Nagaya |   ( Updated:2022-11-28 11:04:32.0  )
మరోసారి విచారణకు నందకుమార్ భార్య చిత్రలేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ వ్యాపార లావాదేవీలపై ఆరా తీయాలని భావిస్తున్న సిట్ అధికారులు ఆయన భార్య చిత్రలేఖను మరోసారి విచారించనున్నారు. ఈ నేపథ్యంలో నేడు మరోసారి చిత్రలేఖ విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం చిత్రలేఖను సిట్‌ అధికారులు విచారించారు. ఈ క్రమంలో నిందితుడు నందకుమార్ వ్యాపార లావాదేవాలకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు సోమవారం విచారణకు రావాలని సిట్ సూచించింది. ఎమ్మెల్యేలకు, ప్రధాన నిందితుడు రామచంద్రభారతికి మధ్య అనుసంధానకర్తగా నందకుమార్‌ ఉండటంతో అతడి పాత్రకు సంబంధించి పూర్తిగా కూపీ లాగడంపై సిట్‌ దృష్టి సారించింది. దీంతో, నేడు చిత్రలేఖ విచారణకు హాజరుకానున్నారు.

ఫాంహౌస్ కేసులో నిందితుడు నందకుమార్ కస్టడీకి కోర్టు అనుమతి

Advertisement

Next Story