- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మహిళా దినోత్సవం రోజే మహిళలకు అవమానం.. కుర్చీల కోసం కొట్లాట
దిశ, మునుగోడు: మహిళా దినోత్సవం రోజే మహిళలకు అవమానం జరిగిన సంఘటన మునుగోడు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బుధవారం మునుగోడు మండల కేంద్రంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ మునుగోడు నియోజకవర్గ స్థాయి వేడుకల కార్యక్రమంలో నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి హాజరైన మహిళలు కూర్చోవడానికి సరిపడా కుర్చీలను ఏర్పాటు చేయలేకపోవడంతో మహిళలు గంటల తరబడి వేచి నిలబడలేక కింద నేలపైనే కూర్చున్నారు. మరికొందరు కుర్చీల కోసం ఒకరికొకరు కుర్చీలు లాక్కొనే పరిస్థితి నెలకొన్నది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి సమక్షంలో ఈ సంఘటన జరుగుతున్న ఆయన స్పందించకపోవడం గమనార్ధం. కార్యక్రమంలో గంటల తరబడి వేచి నిలబడలేక మహిళలు తిరిగి వెళ్లిపోయినట్లు సమాచారం. మహిళా దినోత్సవం రోజు మహిళలకు అవమానం జరిగిందని కార్యక్రమం నిర్వాహకులపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.