- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెల్ట్ షాపులను నిర్మూలిస్తే ప్రత్యేక నిధులు ఇస్తాం
దిశ,మునుగోడు : మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించిన గ్రామాల అభివృద్దికి ప్రత్యేక నిధులు కేటాయిస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం మునుగోడు మండల కేంద్రంలోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మునుగోడు మండలంలో గంజాయిని కూకటివేళ్లతో పెకిలించాలని, గంజాయి అమ్మినా, తీసుకున్నా కేసులు పెట్టి జైలుకు పంపాలని పోలీస్ అధికారులకు సూచించారు. గంజాయి నిర్మూలించడానికి పోలీసులు నిబద్దతతో పని చేయాలని కోరారు. రోడ్లకు ఇరువైపులా కంపచెట్లను తొలగించడానికి ప్రత్యేక అభివృద్ధి నిధుల నుండి 15 లక్షలు వెంటనే మంజూరు చేసి రేపటి నుండి పనులు చేపట్టాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 50.75 కిలోమీటర్ల మేర 26 రోడ్లకు 48 కోట్లు మంజూరు అయ్యాయని గుర్తు చేశారు.
దళితవాడలో అంతర్గత రోడ్ల నిర్మాణం కోసం 10 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపించామని, మునుగోడు నియోజకవర్గంలో పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో ఉన్న రోడ్ల నూతన నిర్మాణానికి 63 కోట్ల రూపాయలతో మరో ప్రపోజల్ ప్రభుత్వానికి పంపించామన్నారు. ఇప్పటికే నిర్మాణంలో ఉండి మరమ్మతుల కోసం 49 రోడ్లకు గాను 48 కోట్లు రూపాయలు ప్రభుత్వానికి నివేదిక పంపించామని, యాదాద్రి భువనగిరి జిల్లా, నల్గొండ జిల్లాల పరిధిలో ఉన్న మునుగోడు నియోజకవర్గం మొత్తానికి పంచాయతీ రోడ్ల నిర్మాణం, రెన్యువల్ కు ఈ ఐదు సంవత్సరాలలో ఏ ఏ ఆర్థిక సంవత్సరంలో ఎన్ని నిధులు కావాలనే అంశాలపై పంచాయతీరాజ్ అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు.
నియోజకవర్గంలో నాణ్యమైన విద్యుత్ అందించడానికి ఎన్ని నిధులు అవసరమవుతున్నాయి అనే దానిపై అధికారుల నుండి వివరణ కోరగా ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 47 కోట్ల రూపాయల నిధులు అవసరం అవుతాయని తెలిపారు. వీటిలో అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్లకు 4 కోట్లు, కొత్త సబ్స్టేషన్ నిర్మాణానికి 10 కోట్లు అవసరమవుతాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ముందుగా మునుగోడు మండలంలోని జక్కలవారి గూడెం గ్రామంలో బెల్ట్ షాపులను నిర్మూలించిన గ్రామస్తులను కూడా శాలువాలతో సన్మానించి, వెంటనే అభివృద్ధి కోసం పది లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు.