Nagarjuna Sagar: సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల

by Mahesh |
Nagarjuna Sagar: సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల
X

దిశ, నాగార్జున సాగర్: తాగునీటి అవసరాల కోసం ఎన్ఎస్‌పీ అధికారులు శుక్రవారం ఉదయం 8 గంటలకు నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ పూర్తిగా ఎండిపోవడంతో అక్కడ ఏర్పడిన తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు తాగు నీటిని విడుదల చేశారు. రోజుకు 1000 క్యూసెక్కుల నీటిని ఎడమ కాలువకు విడుదల చేసినట్లు అధికారులు చెప్పారు. నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విషయం తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని ప్రాజెక్టు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రోజుకి 1000 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేశారు. నీటి విడుదల కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే పొదుపుగా ఉపయోగించాలని అధికారులు కోరారు.

Advertisement

Next Story